తిరుపతిలో వేయిపడకల ఆస్పత్రి
తిరుమల,ఆగస్ట్30(జనం సాక్షి): తిరుపతిలోని అలిపిరి సవిూపంలో టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి పడకల క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరగనుంది. ఇక్కడ ఆస్తప్రి నిర్మించేందుకు టాటా గ్రూపు ముందుకు వచ్చింది.ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తెలిపారు. గురువారం ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… రతన్‌టాటా సాయంత్రం తిరుమల చేరుకుని శుక్రవరాం ఉదయం వెంకన్నను దర్శించుకుంటారని, అనంతరం సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి భూమి పూజ చేస్తారని ఎంపీ తెలిపారు.