తిరుపతి పరిసరాల ప్రజలకు తాగునీటికి కృషి

తిరుపతి,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): సోమశిల-స్వర్ణముఖి ద్వారా చిత్తూరు జిల్లాలో 72 చెరువులు అనుసంధానం జరిగేలా కాలువ తవ్వకం, పూడికతీత పనులు వేగవంతం చేయాలని అధికారులు అన్నారు.   సోమశిల కాలువ నుంచి వచ్చే 2.6 టిఎంసిలకు అదనంగా వాగుల ద్వారా మరో 1.4 టిఎంసిల నీటిని రిజర్వాయర్ల ద్వారా చెరువులకు మళ్లించి నీరు నిల్వ చేయవచ్చన్నారు. తద్వారా తిరుపతి చుట్టుపక్కల వారికి తాగునీరు-సాగునీరు అందజేస్తామని చెప్పారు. సొమశిల-స్వర్ణముఖి లింక్‌ కాలువ వల్ల ఆయకట్టు స్థీరీకరణ జరుగుతుందని చెప్పారు. రిజర్వాయర్‌ పనులకు ప్రజలు అడ్డంకులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.  మ్లలెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌, గాలేరు-నగరి రిజర్వాయర్‌ పనులను పూర్తి చేయడానికి ప్రణాళికలు అమలు చేయాలని  అధికారులను ఆదేశించారు. అధికారులతో రిజర్వాయర్‌ నిర్మాణ పనులపై ఆయన సవిూక్ష సమావేశం నిర్వహించారు. మ్లలెమడుగు, బాలాజీ రిజర్వాయర్‌ నిర్మాణ పనుల వల్ల ముంపుకు గురైన బాధితులకు నష్టపరిహారం, మౌలికవసతులు కల్పించడానికి సంబంధిత శాఖధికారులు ప్రభుత్వానికి నివేదికలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

తాజావార్తలు