తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల,జూలై19(జనంసాక్షి): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడిరచింది. సోమవారనం శ్రీవారిని 77,273 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 35,893 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.