తిరుమలలో ఘనంగా పుష్పయాగం
ఆకట్టుకున్న రకరకాల పుష్పాలు
తిరుమల,అక్టోబర్28(జనంసాక్షి): తిరుమలలో శ్రీవారికి పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో స్వామికి అభిషేకం చేశారు. పుష్పయాగం కోసం వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా రకరకాల పుష్పాలను తెప్పించారు. పుష్పయాగం సందర్బంగా తరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికోసం కొందరు భక్తులు బెంగుళూరు తదితరు ప్రాంతాలనుంచి రకరకాల పూలను వితరణగా పంపారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో స్వామివారి నక్షత్రమైన శ్రవణం రోజు పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం ఉదయం స్వామివారు ఉభయ నాంచారీలతో ఆలయ సంపంగి ప్రాకారం ఉన్న కళ్యాణ మండపానికి వేంచేపు చేసారు. అక్కడ సాయంత్రం వరకు వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. మధ్యలో స్నపన తిరుమంజనం, విశేష సమర్పణ కార్యక్రమాలను అర్చకులు శాస్తోక్తంగా నిర్వహిస్తారు. ఇందుకుగాను టీటీడీ ఉద్యావనశాఖ సుమారు మూడున్నర టన్నుల పుష్పాలను తెప్పించింది. వివిధ రకాల పుష్పాలను దాతల నుంచి భారీ స్థాయిలో సేకరించారు. పుష్పయాగాన్ని పురస్కరించుకుని తిరుమలేశుని ఆలయంలో ప్రతినిత్యం జరిగే సుప్రభాత సేవ మినహా మిగిలిన ఆర్జితసేవలను రద్దు చేశారు. ఇదిలావుంటే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్ర¬్మత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. నవంబరు 15 నుంచి 23 వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉత్సవాల సమయంలో ఉదయం, రాత్రి వేళల్లో రెండు వాహనాలపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఈ మేరకు బ్ర¬్మత్సవాల గోడపత్రిక, ప్రచార పత్రికను ఆవిష్కరించారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గజవాహనం రోజున సుమారు 35వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. పంచవిూతీర్థం రోజున దాదాపు లక్షన్నర మంది పుష్కర స్నానం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల భద్రత కోసం పోలీసు, విజిలెన్స్ విభాగం సిబ్బందిని పెద్దఎత్తున వినియోగిస్తామన్నారు. తిరువీధుల్లో సీసీ కెమెరాల నిఘాను మరింత బలోపేతం చేస్తామన్నారు. వాహన సేవల సమయంలో తోపులాటకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. తితిదే ఉద్యానవనశాఖ, అటవీశాఖ ఆధ్వర్యంలో ఉద్యానవనంలో పుష్పప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయానికి ప్రత్యేక విద్యుత్తు దీపాలంకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారి బ్ర¬్మత్సవాల్లో తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.