తిరుమలలో మొదలైన ప్రక్షాళన

స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల
తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిరదని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టిటిడి నడుచుకుంటోందని అన్నారు. గతంలో పోలిస్తే మార్పులు జరుగుతున్నాయని అన్నారు. తిరుమల శ్రీవారిని సోమవారం మంత్రి పయ్యావుల కేశవ్‌ దర్శించుకున్నారు. అనంతరం విూడియాతో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ.. క్యూ లైనల్లో భక్తులకు టీటీడీ అన్నపానియాలను నిరంతరంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. ధర్మపరిరక్షణలో భాగంగా తిరుమలలో మార్పు మొదలైందని వివరించారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడతుందని అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ భావ వ్యక్తికరణను వ్యక్తం చేస్తున్నారని వెల్లడిరచారు. ప్రభుత్వానికి కూడా ప్రశ్నించే అవకాశం ప్రజలకు దక్కిందని వివరించారు. రాష్ట్రంలో పలు చోట్ల కొంతమంది వ్యక్తులు ్గªల్స్‌ దగ్ధం చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించిందని చెప్పారు. ఇకపై ్గªల్స్‌ సంరక్షణ బాధ్యత ఆ శాఖ విభాగాధిపతిదేనని మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.