తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమల,అక్టోబర్9 (జనంసాక్షి): తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం సింహవాహనంపై స్వామివారి ఊరేగింపు జరిగింది. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిపై భక్తులకు శ్రీవారి దర్శనం లభించనుంది. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం 9 గంటలకు సింహవాహనంలో ఊరేగారు. రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహన సేవలు జరుగనున్నాయి. ప్రత్యేకించి మధ్యాహ్నం ఒంటిగంటకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. శ్రీవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చే రంగనాయక మండపాన్ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పండ్లు, పుష్పాలు, కూరగాయలతో అలంకరిస్తారు. బాదం, కలకండ, పూలరేకులతో వంటి చిన్నపాటి వస్తువులతో ఉత్సవమూర్తులకు తయారు చేసి కిరీటాలు, మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.