తివారీకి రాజ్‌భవన్‌లో నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారికి రాజ్‌భవన్‌లో ఘనంగా నివాళి అర్పించారు.   దిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూయడంతో రాజ్‌భవన్‌లో ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌తోపాటు సలహాదారులు ఏపీవీఎన్‌ శర్మ, ఏకే మహంతి, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తివారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తివారీతో తనకున్న పరిచయాన్ని నరసింహన్‌ గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, విలువలు కాపాడటంలో ఆయన ఎంతగానో కృషి చేశారని గవర్నర్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించారని.. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ గవర్నర్‌గా తివారీ  చేసిన సేవలు మరువలేనివని వ్యాఖ్యానించారు. తివారీ మరణంతో దేశం ఓ రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని నరసింహన్‌ అన్నారు.