తీవ్ర వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి

– నల్లు సుధాకర్ రెడ్డి
  సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి
కురవి జూలై-
(జనంసాక్షి న్యూస్)
తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన పత్తి ,మొక్క జొన్న ఇతర పంటలు ప్రాథమిక దశలోనే దెబ్బతినడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.సిపిఐ కురవి మండల కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలో మంగళవారం జరగగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 20 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వలన పేదల ఇండ్లు కూలిపోయాయని,రైతులు వేసిన పంటలు తీవ్రంగా నష్టపోయాయని ప్రభుత్వ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,  రైతుబంధు డబ్బులు బ్యాంకర్లు రుణాల కింద జమ చేసుకోవడంతో పెట్టుబడులు లేక రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు జమ కాకుండా చూడాలని, పాత రుణాలు రెన్యువల్ చేసి కొత్తగా రుణాలు ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి నెల్లూరు నాగేశ్వరరావు,పోగుల శ్రీనివాస్ గౌడ్,కన్నె వెంకన్న,బుర్ర సమ్మయ్య ,బొల్లం ఉప్పలయ్య,నాగేశ్వరరావు ,దొంతు రామ్మూర్తి సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.