తుఫాన్‌ బాధిత రైతాంగానికి ఊరట

నష్టపోయిన వారిని ఆదుకుంటాం
ఇన్‌పుట్‌ సబ్సిడీ అందచేస్తాం: మంత్రి సోమిరెడ్డి
అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  పంట నష్టంపై ప్రత్యేక బృందాలు ప్రాథమిక నివేదిక ఇచ్చాయని తెలిపారు. పెథాయ్‌  తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతులకు భరోసానిచ్చారు.  బుధవారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ..వారం రోజుల్లో రూ. 50 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేస్తామని, నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేస్తామని చెప్పారు. 60వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయని, 25వేల ఎకరాల్లో అరటి, కొబ్బరి, పూలతోటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అలాగే రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఎఫ్‌సీఐతో మాట్లాడుతామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కంటే ఎక్కువగానే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్నారు. రైతులను ఆదుకునే విషయంలో సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. స్వల్ప కాలిక పంటలు వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని రైతులు కోరారని…వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.  పంట నష్టంపై ప్రత్యేక బృందాలు ప్రాథమిక నివేదిక ఇచ్చాయని తెలిపారు. వారం రోజుల్లో రూ.50 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేస్తామని, నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేస్తామని చెప్పారు. 60 వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయని, 25 వేల ఎకరాల్లో అరటి, కొబ్బరి, పూలతోటలు దెబ్బతిన్నాయని చెప్పారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఎఫ్‌సిఐతో మాట్లాడుతామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల కంటే ఎక్కువగానే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామన్నారు. రైతులను ఆదుకునే విషయంలో సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. స్వల్పకాలిక పంటలు వేసుకునేందుకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. వేరుశనగ విత్తనాలు ఇవ్వాలని రైతులు కోరారని…వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నా