తూనికల కంట్రోలర్‌ కార్యాలయం ప్రారంభం

విజయవాడ,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి):విజయవాడలోని అశోక్‌నగర్‌లో బుధవారం శ్రీ సాయి టవర్స్‌లో తూనికలు కొలతల శాఖ కంట్రోలర్‌ నూతన కార్యాలయం ప్రారంభమయ్యింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువులు, పెట్రోలు బంకులు, గ్యాస్‌ సిలిండర్లు, బంగారం షాపుల్లో సామాన్యులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంఆర్‌పిలో ఇంక్లూడ్‌ జీఎస్‌స్టీ ఉన్న కూడా అదనంగా ఎంఆర్‌పి వసూలు చేసే వారిపై దాడులు చేసి నివారించామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. విస్తృత తనిఖీలు, పర్యవేక్షణ వల్ల ప్రజలు, వినియోగదారుల్లో అవగాహన వస్తుందని తెలిపారు. ఒకే చోట కార్యాలయాలు ఉండటంతో పరిపాలన సులభతరమవుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

 

తాజావార్తలు