*తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జూనోసిస్ వేడుకలు*

కుక్కల నుండి మనుషులకు వ్యాధి సోకకుండా టీకాలు*
52 పెంపుడు శునకములకు ఉచితంగా వ్యాక్సిన్ మందులు
తూప్రాన్(  జనం సాక్షి) జూన్ 6 ::

పెంపుడు జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధులు సోకకుండా టీకాలు వేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ జానకిరామ్ అన్నారు. తూప్రాన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ప్రాథమిక పశువైద్య కేంద్రం ఆవరణలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 52 శునకములకు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద్భంగా మెదక్ జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య మాట్లాడుతూ జునోటిక్ అనగా జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులు అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు జునోసిస్ డే జరుపుకుని జంతువుల నుండి ఎన్నో రకాల వ్యాధులు ఇతర జంతువులకి గానీ మనుషులకు సోకకుండా వుండడానికి టీకాల కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ సత్యలింగం,పశువైద్య మండల అధికారిని లక్ష్మి, అసిస్టెంట్ డాక్టర్ లింగమూర్తి, గోపాలమిత్ర  శ్రీనివాస్, అశోక్ మరియు రైతులు  సాయిలు, సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.