తూర్పు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న బీజేపీ నేత డాక్టర్ వన్నాల వెంకటరమణ
వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 8 (జనం సాక్షి):హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంఎల్ఏ అభ్యర్థుల దరఖాస్తుల నమోదు కేంద్రంలో వరంగల్ తూర్పు నుండి అవకాశం కల్పించాల్సిందిగా డాక్టర్ వన్నాల వెంకటరమణ దరఖాస్తు సమర్పించారు. చార్మినార్ వద్దగల భాగ్యలక్ష్మీ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ కార్యాలయానికి వెల్లారు. తమ కుటుంబం మొదటినుండి బీజేపీ పార్టీలో పనిచేస్తొందని, తనతండ్రి వన్నాల శ్రీరాములువర్థన్నపేట మాజీ ఎంఎల్ఏగా, పార్టీ కోసం వివిధ రాష్ట్రాల్లో ఎంతో కాలంగా సేవచేస్తున్నారని అన్నారు. వరంగల్ తూర్పులో బీసీలు మెజారిటీగా ఉన్నారని, పద్మశాలీలు గెలుపోటములు ప్రభావితం చేస్తారని చెప్పిన డాక్టర్ వన్నాల వెంకటరమణ, తనను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే తూర్పులో కాషాయం జెండా ఎగురవేస్తావని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కనుకుంట్ల రంజిత్, మాదాసు రాజు, మార్టిన్ లూధర్, ఇనుముల అరుణ్, గోవింద్ సింగ్, మోహనాచారి, ఉపేందర్, పలు డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.