తెదేపాలో చేరిన కృష్ణయాదవ్‌

మెదక్‌ : మాజీమంత్రి కృష్ణయాదవ్‌ తెలుగుదేశం పార్టీలో చేరారు. వస్తున్నా… మీకోసం పాదయాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బసచేసిన అలీఖాన్‌పల్లె ప్రాంతానికి కృష్ణయాదవ్‌ కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో పార్టీలోచేరారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కృష్ణయాదవ్‌ స్టాంపుల కుంభకోణంలో అరెస్టు కావడంతో పార్టీకి దూరమయ్యారు.