తెలంగాణకు బొత్స పీసీసీ అధ్యక్షుడు కాదు : పొన్నం
హైదరాబాద్ : సీమాంధ్ర నాయకత్వ కోసం బొత్స కూడా పోటీ పడుతున్నారని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజమండ్రిలో జరిగిన జై ఆంధ్రప్రదేశ్ సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో బొత్స పాల్గొనడంపై పొన్నం అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా ఆదేశించని సభలకు ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు బొత్స ఈ రోజు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు కాదని పేర్కొన్నారు. డిసెంబర్ 9 ప్రకటనపై బొత్స ఏం చెబుతారని ప్రశ్నించారు. రాజమండ్రి సభలో మరో పార్టీని నిందించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సోనియా చెబితే తెలంగాణకు అనుకూలంగా ఓటు వేస్తారో లేదో నిన్నటి సభలో పాల్గొన్నా నేతలు చెప్పాలని కోరారు.



