తెలంగాణకు యాష్కీ ‘రాజీ’నామాం
ఒంటరివాడైన మధుయాష్కి
రాజీనామాలకు కట్టుబడ్డాం : టీ ఎంపీలు
ఉప సంహరణ ఆయన వ్యక్తిగతం
నేడు సోనియాకు స్వయంగా రాజీనామా లేఖలు అందిస్తాం : ఎంపీ రాజయ్య
న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) :
తెలంగాణకు నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ‘రాజీ’నామం పెట్టిండు. ఏఐసీసీ అధికార ప్రతినిధే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామన్నంక రాజీనామాలు అవసరం లేదని కొత్త భాష్యం చెప్పిండు. ఆయనతో బాటు అలాగే మాట్లాడిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనతో వెంటనే మాట మార్చిండు. తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధమని ప్రకటించిండు. ఇప్పటికీ రాజీనామా చేసేందుకు కట్టుబడే ఉన్ననని చెప్పిండు. దీంతో మధుయాష్కీ ఒంటరివాడైండు. తాను మాట్లాడిన మాటలపై కనీసం వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంటేె తెలంగాణపై యాష్కీ పూర్తిగా రూటు మార్చినట్టేనని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. పొన్నం కంటే ముందే ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గడ్డం, వివేకానంద, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాలకు తాము కట్టుబడే ఉన్నామని తేల్చిచెప్పారు. ఒకవేళ రాజీనామాలు అవసరం లేదని ఎంపీ సిరిసిల్ల రాజయ్య గురువారం పదవులకు రాజీనామా చేయనున్నట్టు చెప్పారు. సోనియానే స్వయంగా కలిసి రాజీనామా లేఖలు అందజేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కరలేదన్నారు.