‘ తెలంగాణపై ఒత్తిడికి ఇది సరైన సమయం’:వినోద్‌కుమార్‌

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఇదే సరైన సమయం ‘ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నాయని, దీన్ని అదనుగా తీసుకుని తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన వివరించారు. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్‌ , టీడీపీ, వైఎస్సార్సీపీలు చేస్తున్న మోసాన్ని పల్లెబాట కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు విస్తక్షుతంగా వివరిస్తమని ఆయన తెలియజేశారు.