‘తెలంగాణ’పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఏదీ?
ఆదిలాబాద్, జూలై 10 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ఈ ప్రాంతంలోని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేస్తారని ఐకాస నేతలు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 919వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు, వారి ఆకాంక్షను నేరవేర్చడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించపోతే కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతాని హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.