‘తెలంగాణ’పై కేంద్రం స్పందించాలి

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 1 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ స్పందించాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి 1063వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రకరకాలుగా ప్రకటనలు చేస్తుండడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున వెంటనే సోనియా స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని వారు డిమాండ్‌ చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటామని వారు హెచ్చరించారు.