తెలంగాణలో కషాయ జెండా ఎగరడం ఖాయం – బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు నగ్వాని
తొర్రూరు 1 జులై (జనంసాక్షి )
రాబోయే 2023 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కషాయ జెండా ఎగరడం ఖాయమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు లధారం నగ్వాని అన్నారు. శుక్రవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పాల కేంద్రం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అన్నారం రోడ్డు లోని తిరుమల ఫంక్షన్ హాల్లో బిజెపి పట్టణ అధ్యక్షుడు పల్లె కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పథకాలు అమలు కాకుండా అడ్డుపడుతున్నాడని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, స్వచ్ఛభారత్ లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి టీకాలు అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. దేశంలో పేదలు ఆకలితో అలమటించకుండా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ యోజన కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం సరఫరా చేయడం జరిగింది అన్నారు. ఈనెల 3న హైదరాబాదులోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని అన్నారు. కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బిజెపి రాష్ట్ర నాయకులు పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి పెదగాని సోమయ్య, రాష్ట్ర నాయకులు సామ వెంకట్ రెడ్డి, వెంగళరావు, దామోదర్ రెడ్డి, కర్ర శ్రీనివాస్ రెడ్డి, కొలుపుల శంకర్,పూసల శ్రీమాన్, రవిబాబు, రామ్మోహన్ రెడ్డి, రచ్చ కుమార్, బొచ్చు సురేష్, చలపతిరాజ్, రాజేష్ రాజ్, కుమార్, నవీన్ పాల్గొన్నారు.
2 Attachments