తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
` మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
` డిసెంబర్31నుంచి జనవరి 2 వరకు అమలుకు ఆదేశాలు
` ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో నిర్ణయం
హైదరాబాద్,డిసెంబరు 25(జనంసాక్షి):రాష్ట్రంలో ఓమైక్రాన్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగసభలను నిషేధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతికదూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. వెంటనే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. అన్ని దేశాలతో పాటు భారతలోనూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వైరియెంట్ కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలల నేపథ్యంలో మరింతగా విజృంభించే ప్రమాదం ఉన్నందున పలు రాష్టాల్రు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. శనివారం నుండి జవనరి 2 వరకు ఆంక్షలు వర్తిస్తాయని పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. వేడుకల్లో సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించాలని ఆదేశాల్లో పేర్కొంది. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.