తెలంగాణలో పాగా వేయడమే బిజెపి లక్ష్యం
హైదరాబాద్ కేంద్రంగా బిజెపి జాతీయకార్యవర్గ భేటీ
జూలై మూడో వారంలో ఉంటుందన్న సూచనలు
న్యూఢల్లీి,జూన్1(జనంసాక్షి): తెలంగాణలో పాగా వేస్తామని ప్రకటస్తున్న బీజేపీ నేతలు ఇక్కడ కార్యకలాపలు ఉదృతం చేస్తున్నారు. ఓబిసి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు రాజ్యసభ ప్రవేశం కల్పించారు. ఈ క్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరపనున్నట్‌ఉ తెలుస్తోంది. జూలై 3 వ వారంలో
ఈ సమావేశాలు ఉండవచ్చని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టిన బిజెపి అనేక కార్యక్రమాలను చేపట్టింది. బండి సంజయ్ పాదయాత్ర ముగగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. కెసిఆర్, టిఆర్‌ఎస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అలాగే వరుసగగా ఇప్పుడు టిఆర్‌ఎస్‌నఉ లక్ష్యంగా చేసుకుని కేంద్రపథకాలు, నిధుల విడుదలపై విమర్శలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌కు దీటుగా విమర్శలకు పదను పెట్టారు. ఈ క్రమంలో జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ వేదికగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా కూడా పాల్గొంటారు. మూడు రోజుల పాటు మోదీ, షా హైదరాబాద్‌లోనే మకాం వేస్తారని తెలిసింది. 300 నుంచి 500 మంది వరకూ బీజేపీ సీనియర్ నేతలు ఈ సమావేశాలకు హాజరౌతారని భావిస్తున్నారు. హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఈ సమావేశాలు జరగవచ్చని భావిస్తున్నారు. తాజ్‌కృష్ణాను కూడా బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో బీజేపీ నేతలు తరుణ్‌చుగ్, బీఎల్ సంతోష్ సమావేశాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇదంతా కూడా తెలంగాణలో అధికారం లక్ష్యంగా సాగుతున్న వ్యూహంలో భాగమని అర్థం అవుతోంది.