తెలంగాణలో వ్యవసాయం కీలకరంగం

రాష్ట్ర ప్రగతిలో వ్యవసాయానిది పేద్ద పీట .. జీఎస్డీపీలో 18 శాతం

ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతాంగ శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోస్తున్నది.వ్యవసాయ రంగం బలోపేతం కావడం మూలంగా దాని చుట్టూ అల్లుకున్న రంగాలు బలపడ్డాయి.తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా తెలంగాణలోని కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి.నికర ఆదాయం, నెలవారీ ఆదాయం లేని కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బు మారకం జరుగుతున్నది.సగటున పౌరుల చేతుల నుండి జరుగుతున్న రూపాయి మారకం విషయంలో దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎక్కువగా ఉన్నది అని భావిస్తున్నాను.ఈ ఆర్థికచక్రం ముందుకు నడిపించడం మూలంగా అందరి చేతులకు పనిరావడం జరుగుతున్నది.వ్యవసాయ రంగం బలోపేతం మూలంగా ఇది సాధ్యం కాదు అన్న పిడివాదానికి ఇది సమాధానంగా నిలిచింది.ఆ దృక్కోణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారు .. దీని మూలంగానే రాష్ట్రం బలోపేతమయింది.ఇది ప్రజలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయిలో ఉండాలన్నది కేసీఆర్ అభిలాష.సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం నిలదొక్కుకునే వరకు చేయూతనందిస్తే అంతకుమించి వ్యవసాయదారులకు చేయాల్సింది ఏమీలేదన్నది కేసీఆర్ గారి ఆలోచన.మొదటి విడతలో 35•31 లక్షల మంది రైతులకు రూ.16,144 కోట్ల రుణమాఫీ చేశారు.రెండో విడతలో 30.33 లక్షల మంది రైతులకు రుణమాఫీకి అర్హులుగా గుర్తించారు.వీరికి రూ.20,144 కోట్లకు గాను రూ.8089.74 కోట్లను విడుదల చేయడం జరిగింది.రుణమాఫీలో ఆర్థికమంత్రి హరీష్ రావు గారు, ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శులది కీలకపాత్ర .. అందరి తరపున, రైతాంగం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు

చెమట చిందించే రైతు కుటుంబాల ఆశీర్వాదం బ్యాంకర్ల మీద, ప్రభుత్వం మీద ఉంటుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసం, నమ్మకం.గతంలో రైతులు రుణాలు ఆశించినా బ్యాంకులది ఇవ్వలేని పరిస్థితి.కరువు మూలంగా వ్యవసాయరంగ సంక్షోభం మూలంగా ఆ పరిస్థితి ఏర్పడింది.నేడు ఏ రైతు కూడా రుణాలను కట్టలేని పరిస్థితిలో లేడు.సమాజంలో అత్యంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి రైతు.రైతుకు ఇవ్వడమే తప్ప చేయిచాచే పరిస్థితి ఉండదు.చేయిచాచే పరిస్థితి కలిగించిన కారణంగానే 40, 50 ఏళ్లు రైతులను ఆత్మన్యూనతా భావానికి నెట్టివేసింది.ఆ స్థితి నుండి రైతులను బయటపడేయాలన్న తాపత్రయం రాష్ట్ర ప్రభుత్వానిది.రుణమాఫీకి విడుదల చేసిన నిధులను రైతులకు బ్యాంకర్లు అందజేయాలి .. మరొక దానికి జమచేసూకోకూడదని ఆదేశాలు ఇవ్వాలి.అన్ని శాఖలను అనుసంధానం చేసుకుని అందరికీ రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యేలా బ్యాంకర్లు సహకరించాలి.