తెలంగాణవాదులు శాంతికాముకులు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణవాదులు శాంతికాముకులని, దౌర్జన్యాలకు పాల్పడరని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం వ్యాఖ్యనించారు. మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణవాదులను కోరారు. హింసకు పాల్పడుతున్నది పోలీసులేనని, డీజీపీ రెచ్చ గొడుతున్నారని ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆకారణంగా తెలంగాణవాదులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్చ్ వేదిక నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలియజేశారు.



