తెలంగాణసాధనలో సింగరేణిది కీలకపాత్ర
` బొగ్గు ఉత్పత్తిని ఆపి నాటి ప్రభుత్వంపై కార్మికులు ఒత్తిడి తెచ్చారు
` సింగరేణి మూతపడుతుందన్న దశలో కాకా వెంకటస్వామి ఆదుకున్నారు
` దేశంలో వెలుగులు విరాజిల్లుతున్నాయంటే.. సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు కారణం
` కాంట్రాక్టు కార్మికులకు కూడా పండగ బోనస్ ఇస్తున్నాం
` కార్మికులకు బోనస్ ప్రకటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యేక పాత్ర పోషించారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికుల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఎప్పటికి గుర్తుంచు కుంటుందని అన్నారు. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది సర్కార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూతపడుతుందన్న దశలో సింగరేణిని కాకా వెంకటస్వామి ఆదుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో బొగ్గు ఉత్పత్తి మొత్తని స్తంభింపచేసి అప్పటి ప్రభుత్వాల విూద ఒత్తిడి తెచ్చినట్లు గుర్తు చేశారు. దేశంలో వెలుగులు విరాజిల్లుతున్నాయంటే.. సింగరేణి కార్మికులు ఉత్పత్తి చేసిన బొగ్గు కారణమని అన్నారు సీఎం రేవంత్. నిరంతరం కస్టపడి రాష్ట్ర ఆదాయంలో, దేశ ఆదాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులను సంస్థకు వచ్చిన లాభాల్లో భాగస్వామ్యం చేస్తోందని అన్నారు. ఒకప్పుడు సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోయి మూతపడే దశలో ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి కేంద్రంతో మాట్లాడి సంస్థను ఆడుకున్నారని అన్నారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లాభాల్లో నడుస్తుందని అన్నారు సీఎం రేవంత్.ఇప్పుడు సంస్థకు వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తూనే.. కార్మికుల భవిష్యత్తు కోసం చర్యలు చేపట్టామని అన్నారు. కార్మికులకు పండగ బోనస్ తో పాటు- భవిష్యత్ పెట్టు-బడుల కోసం కూడా నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా పండగ బోనస్ ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. సింగరేణి సంస్థ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడి ఎదగాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్.
సింగరేణి కార్మికుకలు దసరా బొనాంజా
లాభాల్లో 34శాతం బోనస్‌గా ప్రకటించిన ప్రభుత్వం
సగటున ఒక్కొక్క కార్మికుడికి రూ.1.95 లక్షల బోనస్
భూపాలపల్లి, సెప్టెంబర్ 22 (జనంసాక్షి):సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో సింగరేణి ఉద్యోగులకు 34% లాభాల వాటా బోనస్ చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల రూపాయల నికర లాభాలు సాధించగా, దీనిలో సింగరేణి సంస్థ చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 4,304 కోట్లను కేటాయించడం జరిగిందని, మిగిలిన రూ.2,360 కోట్లు నికర లాభాల్లో 34 శాతం సొమ్ము అనగా రూ. 819 కోట్ల రూపాయలను లాభాల వాటా బోనస్ గా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.సింగరేణిలోని సుమారు 41,000 మంది కార్మికులకు 34% లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి సగటున రూ.1,95,610 వరకు లభిస్తాయి. గత ఏడాదితో పోల్చితే సగటున ఒక్కో ఉద్యోగికి 4.4 శాతం అదనంగా రూ.8,289 మేర లాభాల బోనస్ లభించనుండటం విశేషం. గత ఏడాది సగటున ఒక్కో కార్మికుడి రూ.1,87,321 లాభాల బోనస్ చెల్లించడం జరిగింది. అలాగే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఈ ఏడాది రూ.5,500 బోనస్ ను కూడా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి చరిత్రలో తొలిసారిగా 5,000 రూపాయల బోనస్ ను ప్రజా ప్రభుత్వం చెల్లించిందని పేర్కొన్నారు.1999-2000 సంవత్సరంలో తొలిసారిగా సంస్థను కాపాడాలని, ఉద్యోగుల్లో పని సంస్కృతిని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సింగరేణి యాజమాన్యం లాభాల వాటా బోనస్ ను ప్రకటించింది. ఆ సంవత్సరంలో వచ్చిన లాభాలు 300 కోట్లు కాగా యాజమాన్యం 10% బోనస్ ప్రకటించింది. ఇది 30 కోట్లు మాత్రమే. నాడు సింగరేణిలో పనిచేస్తున్న 1 లక్ష 7 వేలమంది కార్మికులకు ఈ 30 కోట్లను పంచగా ఒక్కొక్కరికి రూ.2782 బోనస్ లభించింది. 2000-2001 లో సగటున ఒక్కో ఉద్యోగికి రూ.805 చొప్పున బోనస్ లభించింది. అప్పట్లో కార్మికుల సగటు జీతం రూ.8,500 మాత్రమే కావడం గమనార్హం. ఇప్పుడు సగటున జీతం రూ.1.7 లక్షలుగా ఉండటం విశేషం. గత ఏడాది ప్రజా ప్రభుత్వం వారు 33% లాభాల వాటా బోనస్ ను ప్రకటించారు. మొత్తం 763 కోట్ల రూపాయలను 33% లాభాల వాటా కింద పంపిణీ చేయగా ఒక్కొక్కరికి సగటున 1 లక్ష 87 వేల రూపాయలున బోనస్ కాగా,ఈ ఏడాది నికర లాభాలలో కేటాయించబడిన రూ.2360 కోట్ల రూపాయలలో, 34% శాతం లాభాల వాటా బోనస్ ప్రకటించగా ఒక్కొక్కరికి సగటున రూ. 1,95,610 లు లభించనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చెల్లించిన లాభాల బోనస్ తో పోలిస్తే ఈసారి మంచి మెరుగుదల కనిపిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపు తర్వాత లాభాలు రూ.4701 కోట్లు కాగా 2024 25 లో ఇవి 36% వృద్ధితో రూ.6394 కోట్లకు చేరాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , గడ్డం వివేక్ వెంకటస్వామి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణు గోపాలరావు, షబ్బీర్ అలీ, పార్లమెంటు సభ్యులు పి. బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, గండ్ర సత్యనారాయణ, గడ్డం వినోద్, దానం నాగేందర్, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహులు సింగరేణి సంస్థ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కే వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఈ అండ్ ఎం ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్ మెంట్ బి వెంకన్న, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మార్కెటింగ్ టి. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
సింగరేణి ఓ ఉద్యోగాల గని: భట్టి
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదని, అది ఒక ఉద్యోగ గని అని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ రాష్టప్రభుత్వానికి ఆత్మవంటిదని అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని, రాష్టప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించామని, గత పదేళ్లుగా సింగరేణి సంస్థ కొత్త బ్లాక్ లకు వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నామని, ఒక్కో కార్మికుడికి బోనస్ రూ. 1,95,610 పంపిణీ జరుగుతుందని అన్నారు. మొత్తంగా రూ. 819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని, సింగరేణి సంస్థ మొత్తంగా రూ.6,394 కోట్లు- ఆర్జించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండిరగ్ జోన్స్
` వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం
` చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు
` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండిరగ్ జోన్స్‌ను ఏర్పాటు- చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, ఫైర్ సేప్టీ అంశాలపై పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి. వీధి దీపాలకు సోలార్ విద్యుత్ వినియోగం, కొత్తగా పునరుద్ధరిస్తున్న చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు- అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు . ఐదు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు- సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కోర్ అర్బన్ రీజియన్‌లో వీధుల ఆధునీకరణ, సుందరీకరణ చేపట్టాలని మార్గనిర్దేశర చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు- చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. విద్యుత్ సబ్ స్టేషన్ల అప్ గ్రేడేషన్‌తో పాటు-, విచ్చలవిడిగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను స్ట్రీమ్ర్ లైన్ చేసి రీ-లొకేట్ చేయాలని దిశానిర్దేశర చేశారు సీఎం. మంచినీటి, మురుగునీటి వ్యవస్థపై నిర్వహణ వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతుల విషయంలో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
నేడు సీఎం రేవంత్ మేడారం పర్యటన
` ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రావిూణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రావిూణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షబరిష్ లతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశా నిర్దేశర చేశారు. ఈ సమావేశంలో ఎ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ- చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ డిఒ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఇఒ వీరస్వామి, ఎ పి ఓ వసంత రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సిఎం రేవంత్ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు- చేస్తున్నారు. మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన, గద్దెల మార్పుపై ఫైనల్ డిజైన్ విడుదల వంటి కీలక కార్యక్రమాలు ఈ సందర్శనలో భాగంగా ఉన్నాయి. మంత్రి సీతక్క ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటు-పాట్లు- లేకుండా చూడాలని, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సజావుగా సాగేలా భద్రత, రవాణా, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్నారు. ఆయన తొలుత సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని, ఆ తర్వాత మేడారం మహాజాతరకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో, గద్దెల మార్పుకు సంబంధించిన ఫైనల్ డిజైన్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం మేడారం జాతరకు కొత్త ఒరవడిని అందించనుంది. మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుంది. సీఎం పర్యటన ఈ ప్రాంతంలో అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ సంరక్షణకు ఊతమిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమాలు రాష్ట్రంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్శన రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మేడారం జాతర భక్తులకు కీలకంగా మారనుంది.
జాతీయ రహదారుల నిర్మాణంలో జాప్యం చేయొద్దు
` నిర్దేశిత సమయంలో భూ సేకరణ, పరిహారం పంపిణీ పూర్తి చేయాలి
` అభివృద్ది కేంద్రంగా భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ హైవే
` భూ సేకరణ పెండిరగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
` నాన్ వైల్డ్ లైఫ్ ఏరియాల్లో వైల్డ్ లైఫ్ మిటిగేషన్ ప్లాన్‌కి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది
` అటవీ భూములకు పరిహారంగా ప్రత్యామ్నాయం భూ కేటాయింపు
` భూ సేకరణ, పరిహారం పంపిణీలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై వేటు
` సత్వర అనుమతుల కోసం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్‌లతో త్వరలో భేటీ
` జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని… అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం.. అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారుల విభాగం (ఎన్‌హెచ్), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్), రహదారులు, భవనాల శాఖ, అటవీ శాఖ అధికారులతో సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపు… సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా… తర్వాత ప్రక్రియలో ఆలస్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం వాటిల్లుతుండడం సరికాదని.. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖాధికారులకు సీఎం సూచించారు. భూ సేకరణను వేగవంతం చేసి పరిహారం తక్షణమే అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నార్త్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాన్ని తాము నివృత్తి చేస్తున్నా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారంటూ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సందేహాలన్నింటిని ఒకే సారి పంపాలని అధికారులకు సూచించారు.. ఆ అంశంపై తాము చర్చించుకున్నామని… ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉంటే వెంటనే పంపుతామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సీఎంకు తెలియజేశారు. ఆర్‌ఆర్‌ఆర్ నార్త్.. సౌత్‌ను రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడవద్దని… సౌత్‌కు కూడా నార్త్‌కు ఇచ్చిన నెంబర్‌ను కొనసాగించాలని…వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండిరటి పనులు ప్రారంభమయ్యేందుకు సహకరించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సీఎం సూచించారు. అందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేయాని సీఎం కోరారు… భారత్ ఫ్యూచర్ సిటీ-అమరావతి-మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్… లాజిస్టిక్ పార్క్.. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య అనుసంధానం ఏర్పడడంతో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉంటుందని సీఎం అన్నారు. హైదరాబాద్-విజయవాడల మధ్య 70 కిలోమీటర్లు దగ్గరవడంతో పాటు సరకు రవాణాతో భారత దేశంలో మరే జాతీయ రహదారిపై లేనంత రద్దీ.. ఆదాయం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోనూ రెండు రాష్ట్రాల మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తక్షణమే రంగంలోకి దిగి పీఎం గతిశక్తి లేదా మరే పథకంలోనైనా ఈ రహదారికి అవసరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు అలైన్‌మెంట్ ఖరారు చేయాలని సూచించారు. ఈ రహదారికి సమాంతరంగా తాము రైలు మార్గం అడుగుతున్నామని… బెంగళూర్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-అమరావతి మధ్య రైలు మార్గం అవసరమని.. వందేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోకలకు ఇది అనువుగా ఉంటుందని.. లాభసాటి మార్గమని సీఎం అన్నారు. హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో రావిర్యాల- మన్ననూర్‌కు సంబంధించి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు సాగిస్తారని సీఎం తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అనుమతులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్-మన్నెగూడ రహదారిలో మర్రి చెట్ల తొలగింపునకు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కేసు పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. హైదరాబాద్-మంచిర్యాల-నాగ్‌పూర్ నూతన రహదారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలనే అంగీకరించాలని సీఎం కోరారు. తాము ప్రతిపాదించిన మార్గంతో నూతన పారిశ్రామిక పార్క్‌ల ఏర్పాటుతో పాటు పలు జాతీయ రహదారుల అనుసంధానం పూర్తవుతుందని సీఎం తెలిపారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163జి), ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్-563), మహబూబ్‌నగర్-మరికల్-దియోసుగూర్ (ఎన్‌హెచ్-167) రహదారులకు సంబంధించి భూ సేకరణ… పరిహారం పంపిణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలెక్టర్లను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పలుచోట్ల కోర్టు కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని కలెక్టర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అన్ని జిల్లాల్లో ఉన్న కేసులన్నింటిపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పరిహారం పంపిణీలో ఆలస్యంపై సీఎం ప్రశ్నించగా కాలా (%జశీఎజూవ్‌వఅ్ Aబ్‌ష్ట్రశీతీఱ్‌వ టశీతీ ూaఅస Aషనబఱంa్‌ఱశీఅ%) నుంచి నిధుల విడుదలలో జాప్యం ఉందని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు స్పందిస్తూ జాబితాలు అప్‌లోడ్ అయిన వెంటనే నిధులు విడుదల చేస్తున్నామని, కలెక్టర్లు ఆ పనులు త్వరగా చేయాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం జాప్యాన్ని సహించమని సీఎం కలెక్టర్లను హెచ్చరించారు. భూ సేకరణలో ఆర్బిట్రేషన్ కేసులు పెండిరగ్‌లో ఉంచడం సరికాదని.. వెంటనే వాటిని పూర్తి చేయడంతో పాటు కాలాకు జాబితాలను అప్‌లోడ్ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. భూసేకరణ, పరిహారం పంపిణీని అక్టోబరు నెలాఖరుకు కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. భూ సేకరణ, పరిహారం నిర్ణయం, పంపిణీ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లపై వేటు వేస్తామని సీఎం హెచ్చిరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ పెడుతున్న కొర్రీలపైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2002 నుంచి 2022 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని… దాంతో ప్రస్తుతం అనుమతులు ఇవ్వడం లేదని ఫారెస్ట్ సౌత్ రీజియన్ ఐజీ త్రినాధ్ కుమార్ తెలిపారు. దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పని చేసిన అధికారులు ఇప్పుడు లేరన్నారు. ఉల్లంఘనలకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. అవసరమైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని సీఎం తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌లతో తాను స్వయంగా భేటీ అవుతానని సీఎం తెలిపారు. వన్యప్రాణులు లేని అటవీ ప్రాంతాల్లోనూ వన్య ప్రాణుల చట్టం అమలు చేస్తున్నారని సీఎం అన్నారు. నాన్ వైల్డ్ లైఫ్ ఏరియాల్లో వైల్డ్ లైఫ్ మిటిగేషన్ ప్లాన్‌కి ఎన్‌హెచ్‌ఏఐలో ఎటువంటి ప్రొవిజన్ లేకపోవడంతో అనుమతులు ఆలస్యమవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో అవసరమైన వ్యయం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో చొరవ చూపి అటవీ అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణకు సీఎం సూచించారు. తమ కార్యాలయ నిర్మాణానికి హైదరాబాద్‌లో రెండు ఎకరాల భూమి కేటాయించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వారికి అవసరమైన భూమిని చూసి ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తమ విజ్ఞప్తికి సత్వరమే స్పందించినందుకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వినయ్ కుమార్ రజావత్, ఎన్‌హెచ్‌ఏఐ సభ్యుడు (ప్రాజెక్ట్స్) అనిల్ చౌదరి, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీం తదితరులు పాల్గొన్నారు.