తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ జన సమితి (TJS) మద్దతు..

భైంసా రూరల్ జనం సాక్షి సెప్టెంబర్ 25

నిర్మల్ జిల్లా, బైoసా R&B గెస్ట్ హౌస్ అవరణలో చేపట్టిన నిరవధిక సమ్మె కు తెలంగాణ జన సమితి ముధోల్ నియోజకవర్గ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
ఆశ వర్కర్లకు పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని TJS నాయకులు పల్లపు తులసిరామ్, మీనాజ్, అలీo ఖాన్ లు అన్నారు రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారని, వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారని, ప్రారంభం నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్వహించిన అనేక ట్రైనింగ్లు పొందారు. రీజెస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బిపి, షుగర్, థైరాయిడ్ తదితర అన్నిరకాల జబ్బులను గుర్తిస్తున్నారు. ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేస్తున్నారని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తున్నారు. వీటితో పాటు గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు, ఇతర ప్రజలకు సేవలందిస్తున్నారు. కరోగా మహమ్మారి. కాలంలో కరోనాను నియంత్రించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారు.గతంతో పోలిస్తే ఈ కాలంలో ఆశా వర్కర్లకు పనిభారం పెరిగిందని పని చేస్తున్న ఆశా వర్కర్లకు కేవలం రూ.9,750/-లు పారితోషికాలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తున్నది.ఒకవైపు పని భారం పెరిగింది. మరొకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిలో వచ్చే పారితోషికాలు సరిపోక ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ఆశాల పారితోషికాలను రూ.18,000/-లకు పెంచి ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల తరుపున ప్రభుత్వాన్ని కోరుతున్నాo, కావున ఆశల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని TJS డిమాండ్ చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు విజయ, మౌనిక, లక్ష్మి, సుజాత, ఉజ్వల, శాంత, రషిత తదితరులు పాల్గొన్నారు.