తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ఉత్తర కర్నాటక పోరు

కుమారస్వామి నిర్లక్ష్యంపై బిజెపి ఎమ్మెల్యే శ్రీరాములు విమర్శ

బెంగళూరు,జూలై28(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమం తరహాలో ఉత్తర కర్ణాటక కోసం పోరాడుతామని బిజెఇపకి చెందిన ఎమ్మెల్యే శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్ర కర్నాటక జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి కుమారస్వామి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, అభివృద్ధి నిధుల విడుదల లాంటి కీలక విషయాల్లో ఉత్తరకర్ణాటక జిల్లాల ప్రజలను ముఖ్యమంత్రి అగౌరవపరుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం, దాని ఫలితాన్ని శ్రీరాములు గుర్తుచేస్తూ మేము కూడా ఉత్తరకర్ణాటక అభివృద్ధికి పోరాటం చేస్తామని అన్నారు. ఎవరైనా ముందు కొచ్చి ఉత్తర కర్ణాటక తెలంగాణాలా న్యాయం జరిగేందుకు ఉద్యమం చేస్తేమేము తాము పూర్తి మద్దతు ఇస్తామన్నారు.నాకు పదవులు ముఖ్యం కాదు.. ప్రజల బాగోగులే ముఖ్యం అంటే గద్దెనెక్కిన ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పదవిని అంటి పెట్టుకుని ఉత్తరకర్ణాటక జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని మొళకాల్మూరు ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ జాతీయ ప్రచారకర్త అయిన శ్రీరాములు అన్నారు. బళ్లారిలోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కుమారస్వామి పదవిని స్వీకరించి రెండు మాసాలు దాటినా బళ్లారి జిల్లాఇన్‌చార్జి మంత్రిని నియమించడంలో ఎందుకు ముందుకు రాలేదో ఆపార్టీ వారే చెప్పాలన్నారు. విధానసౌధలో దళారుల రాజ్యం ఏలుతున్నారని స్వయానా మిత్రపక్షం అయిన కాంగ్రెస్‌ నాయకులే ఆరోపిస్తున్నట్లు అన్నారు. రాష్ట్రంలో 16 జిల్లాల్లో జెడీఎస్‌ ఎమ్మెల్యేలు అసలులేరు. 100 స్థానాల్లో జేడీఎస్‌ నుండి పోటీ చేసిన అభ్యర్థులు డిపాజిట్‌ కూడా రాలేదు. కేవలం 24 సీట్లు గెలిచిన విూరు ముఖ్యమంత్రి అయ్యారని ఎ/-దదెవా చేశారు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రకటించారు. అది కూడా ఇంకా అమలులోకి రాలేదని గుర్తు చేశారు. ఉత్తర కర్ణాటక అభివృద్ధి విషయంలో కుమారస్వామిసర్కారు పూర్తిగా విస్మరిస్తుందని అన్నారు. ఎమ్మెల్యేకి రాజీనామాచేసి ఉత్తర కర్ణాటక అభివృద్ధికి పోరాడుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.