తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఆదిలాబాద్, నవంబర్ 24 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని చేపట్టనున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంనాథ్ తెలిపారు. ఈ మేరకు కార్యాచరణను రూపొందించామని ఇందులో భాగంగా డిసెంబర్ 9,10,11 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా భరోసా దీక్షల పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా ఈ నెల 26న ఎబివిపి చేపడుతున్న మహా పాదయాత్ర, నగరా సమితి నాయకులు జనార్దన్‌రెడ్డి చేపడుతున్న భరోసా యాత్రకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్రానికి తమ సత్తా చాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ విషయమై ప్రకటన చేసి మూడేళ్లు అవుతున్న, ఎలాంటి పురోగతి లేనందున తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచర్చించారు.