తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చాకలి ఐలమ్మ – పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కొనియాడారు. ఈ నెల 10న మంథనిలో జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సభకు సంబంధించిన కరపత్రాలను పుట్ట మధు గురువారం సాయంత్రం తన నివాసం రాజ గృహంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏళ్ల తరబడి కొనసాగిన తెలంగాణ పోరాటంలో చాకలి ఐలమ్మ పేరు వినని రోజు, ఉద్యమం లేదన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో పలు విధాలుగా ఉద్యమాన్ని నిర్వహించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం హర్షనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన చాకలి ఐలమ్మ వర్ధంతి సభకు మంథని నియోజకవర్గంలోని ఆమె అభిమానులు, తెలంగాణ పోరాట యోధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, వైస్ చైర్మన్ అరపెల్లి కుమార్, ఏఎంసీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, కన్వీనర్ పోతరాజు సమ్మయ్య, వైస్ ఎంపీపీ స్వరూప్, ఆకుల కిరణ్, గొబ్బూరి వంశీ జంజర్ల లింగయ్య, సంపత్ లు పాల్గొన్నారు.