తెలంగాణ ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రావి శివరామకృష్ణ ఎన్నిక
కరీంనగర్:అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ ఆదివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్కు చెందిన ఎం వేణు, ఉపాధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన వీ రాజు, కార్యదర్శిగా ఖమ్మంకు చెందిన రావి శివరామకృష్ణ, సహాయ కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆర్ఎన్ శంకర్తోపాటు 18 మంది కార్యవర్గ సభ్యులు, 47 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో మహాసభ నూతన కమిటీ ఎన్నుకున్నట్లు చెప్పారు.