తెలంగాణ కోసం జిల్లా యువకుడి అత్మహత్య
తలమడుగు :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఓ విద్యార్థి అత్మ బలిదానానికి పాల్పడిన సంఘటన బుధవారం తలమడుగులో చోటు చేసుకుంది. మండలంలోని కుచలాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ (28) బుధవారం హైదరాబాద్లోని ఉస్మానియా క్యాంపస్లో ఉరేసుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు. అదే క్యాంపస్లో ఎంఎస్సీ చదువుతున్న సంతోష్ కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు.