‘తెలంగాణ’ కోసం రాజీలేని పోరాటం
ఆదిలాబాద్, జూలై 19 : రాజిలేని పోరాటం ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 928వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలతోపాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసికట్టుగా ఉద్యమిస్తే కేంద్రం స్పందించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని వారు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షను ఎవరూ విస్మరించినా వారికి తగిన గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రం సాధించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.