తెలంగాణ పబ్లిక్ & ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సూర్యావంశం రాము ఎన్నిక

తెలంగాణ పబ్లిక్ మరియు ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సూర్యావంశం రాము ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణ కేంద్రంలో సోమవారం నిర్వహించడం జరిగిందని,ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని,రాష్ట్ర కమిటీలో వనపర్తి జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా సూర్యవంశం రాము, రాష్ట్ర నాయకులుగా ఉషాన్న గారిని ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ మహాసభలలో రాష్ట్ర వ్యాప్తంగా ఓనర్స్ మరియు డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించమని అనంతరం రాష్ట్ర కమిటీకి ఎంపిక చేసిన సిఐటియు వనపర్తి జిల్లా కమిటీకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నామని అన్నారు.రానున్న రోజులలో డ్రైవర్ల సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమిస్తామని అన్నారు.