తెలంగాణ బిల్లు ఆమోదానికి ఏడాది

జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభ
కరీంనగర్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
: తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొంది శుక్రవారం సంవత్సరం పూర్తయిన సందర్భంగా సోనియాగాంధీకి కృతజ్ఞతగా జిల్లా కాంగ్రెస్‌ సమావేశం ఏర్పాటు చేసింది. బిల్లు ఆమోదం పోందేలా కృషి చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్యభూమిక పోషించిన ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశామని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కటకం మృత్యుంజయం తెలిపారు. జిల్లా  కాంగ్రెస్‌ కార్యాలయంలో కృతజ్ఞత సమావేశం జరిగింది. ముందుగా 1969 నుండి 2014 వరకు తెలంగాణ కొరకు పోరాడి బలిదానాలు చేసుకున్న అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా కటకం మృత్యుంజయం మాట్లాడుతూ,2014 ఫిబ్రవరి 20న చారిత్రాత్మక దినమని, సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గర్తించి, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి త్యాగాలను గుర్తించి బిల్లుకు ఆమోదం దక్కేలా చేశారని అన్నారు.  కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే తెలంగాణ ఏర్పడితే ఆఖ్యాతి కాంగ్రెస్‌ పార్టీ వారికే దక్కుతుందనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, సోనియా గాంధీ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతిపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చారన్నారు.  ఓట్లకోసం, సీట్లకోసం ఆశించకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపట్ల క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మనోబావాలకు తగ్గట్టుగా రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇలా సోనియా తెలంగాణ ప్రజల మనస్సులో చెరగని ముద్రవేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పధాకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళకపోవడంతో పాటు, తెలంగాణ ఇచ్చింది మనమే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లలేక పోవడం వల్లే పార్టీ ఓటమి పాలైందని సభలో పాల్గొన్న పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.  టి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం అమలుకు నోచుకోని హావిూలిచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈసమావేశంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు కర్ర రాజశేఖర్‌ ,గందె మాధవి మహేష్‌, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనవాస్‌, దిండిగాల మధు, వి.గణెళిష్‌బాబు, ఎలగందుల మల్లేశం, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ముస్తాక్‌, పడాల శంకరయ్య గౌడ్‌, వేల్పుల వెంకటేశ్‌, వీరబోయిన కుమార్‌యాదవ్‌, వెన్న రాజమల్లయ్య, దన్నాయక్‌ దామోదర్‌రావు, బొబ్బిలి విక్టర్‌, గడ్డం విలాస్‌రెడ్డి, ధరణికోట దామోదర్‌, ఆకుల ప్రకాష్‌, మాదాసు శ్రీనివాస్‌, మూల జైపాల్‌, మడుపు మోహన్‌, బొమ్మ ఈశ్వర్‌గౌడ్‌, బాసెట్టి కిషన్‌, జక్కని ఉమాపతి, ఫజల్‌, మదన్‌రెడ్డి, పోన్నం మధు, పడాల రాహూల్‌, తునికి బాలరాజ్‌, డి.నర్సింగరావు, శ్రావణ్‌, నదీం, సన్ని హెడ్వర్డ్‌, మగ్దుం అలి, ఖలీమొద్దిన్‌, దన్నుసింగ్‌, నాగుల సతీష్‌, జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.