తెలంగాణ మాదిరిగా ఆశా వర్కర్ల జీతాలు పెంచాలి

ఏలూరు,డిసెంబర్‌25(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఆశా కర్యకర్తలకు  కనీస వేతనం రూ.ఆరు వేలు ఇవ్వాలని జిల్లా ఆశావర్కర్లు డిమాండ్‌ చేశారు. అలాగే తమకు ఉద్యోగ  భద్రత, పిఎఫ్‌, ఇఎస్‌ఐ కల్పించాలని, ఆశా కార్యకర్తలను వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న యూనిఫారాల అలవెన్స్‌ కూడా వెంటనే చెల్లించాలని కోరారు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.ఆరు వేలు ఇవ్వాలని అన్నారు.
ఆశా వర్కర్ల సమస్యలు తక్షణం పరిష్కారించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ చేస్తున్న పోరాటాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని  విమర్శించారు. పనికి తగ్గ పారితోషికం అని చెప్పి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.