తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఘనత కమ్యూనిస్టులదే.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలన అంతం కోసం పోరాటం చేసిన ఘనత కమ్యూనిస్టుల దేనని అఖిల భారత యువజన సమైక్య  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరా శ్రీను అన్నారు.నేరేడుచర్ల పట్టణ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మతోన్మాద బిజెపి నాయకులకు రైతాంగ పోరాట పట్టిమ గురించి మాట్లాడే అర్హత, హక్కు లేదని  రాజకీయ లబ్ధి కోసమే   తెలంగాణ సాయుధ పోరాటాన్ని  పక్కదారి పట్టిస్తున్నారని,ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అగ్రభాగాన నిలిచిందని రాచరిక రజాకార్ల భూస్వాముల నిరంకుశ పాలనకు  వ్యతిరేకంగా,రావి నారాయణరెడ్డి, మఖ్డుమ్ మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి లాంటి ఎందరో మహనీయులు ఎర్రజెండాను భుజాన నిలుపుకొని ఉద్యమం కొనసాగించారని ఈ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర  భవిష్యత్ తరాలకు చిరస్మరణీయంగా నిలబడుతుందని బిజెపి లాంటి మతతత్వ పార్టీ  చరిత్రను ఎంత వక్రీకరించిన ప్రజలు నమ్మరని ఆనాటి  తెలంగాణ సాయుధ పోరాటం గురించి   మాట్లాడుతున్న ఈనాటి  బిజెపి నాయకత్వం ఎక్కడో మూలన ఉన్నారని, నాడు బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన  వారి గురించి చులకనగా మాట్లాడే అర్హత వీళ్ళకి లేదని భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి  విముక్తి కోసం  పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టుల దే నని నేటి పాలకులు పోరాట యోధుల చరిత్రను కనుమరుగు చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని,బడా వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మలా మారిన ఈ మతతత్వ పార్టీని ప్రజలు క్షమించారని ఆయన అన్నారు.ఈ సమావేశంలో నాయకులు రేఖ ఉపేందర్, శ్రీపాద శ్రీనివాస్ చారి, కొడగండ్ల శివ,లంకలపల్లి శేఖర్, దాసోజు వెంకటాచారి,తదితరులు పాల్గొన్నారు.