*తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా, తెలంగాణ సమైక్య దినోత్సవం జరిపినందుకు బిజెపి శ్రేణుల నిరసన*
మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 18
(జనం సాక్షి)
నిన్న జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకుండా తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులను అవమానించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా బిజెపి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలపడం జరిగింది. అనంతరం స్థానిక నాయకులతో కలిసి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంఐఎంకు భయపడి విమోచన దినోత్సవం జరపకుండా తెలంగాణ సమైక్య దినోత్సవం జరపడం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరులను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ పోరాట యోధులు దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ లాంటి మహానుభావులను అవమానించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పూదరి అరుణ, జేఎన్ సునిత, జేఎన్ వెంకట్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్, బిజెవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెల నవీన్, ఐటీ సెల్ జోనల్ ఇంచార్జ్ మిట్టపెల్లి సాయికుమార్, మండల అధ్యక్షుడు కొమ్ముల రాజ్‌పాల్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు మదన్ మోహన్, బత్తిని శంకర్ గౌడ్, గంప శ్రీనివాస్, మన్నె గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెట్లపెల్లి మీనా, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు బండారి రమేష్, మద్దెల లావణ్య, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు పుల్ల సౌజన్య, వరలక్ష్మీ, సునిత, బిజెపి నాయకులు తోకల సత్యనారాయణ, శ్రీనివాస్,సుంకె అశోక్, బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకెట విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్ , బొడ్ల గౌతమ్, బిజెవైయం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్, పట్టణ ఉపాధ్యక్షుడు కుడుకల రఘు, ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్, కార్యదర్శులు యామ వినోద్, భీమనాతి విజయ్, మిట్టపల్లి శివ,శంకర్, ప్రసాద్, రోహిత్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.