తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ప్రతిఒక్కరికీ ఆదర్శమూర్తి

రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .

వనపర్తి బ్యూరో సెప్టెంబర్26 (జనంసాక్షి)

తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ ప్రతిఒక్కరికీ ఆదర్శమూర్తి ఆనీ రాష్ట్ర వ్యవసాయ , మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కొత్త బస్ స్టాండ్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూమాలలతో నివాళులర్పించారు. అనంతరం వివేకానంద కూడలి వద్ద వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ కు మంత్రి భూమి పూజ చేసారు. ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ముద్దు బిడ్డలు, త్యాగధనులు, తొలిదశ, మలి దశలో అసువులు బాసిన అమర వీరులకు ప్రభుత్వం ద్వారా జయంతి ఉత్సవాలు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తద్వారా భావి తెలంగాణ సమాజానికి తెలంగాణ చరిత్ర గుర్తుండే విధంగా ఎప్పుడు మననం చేసుకునే విధంగా ఉంటాయి అన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహా ప్రతిష్ఠ సైతం ఇందులో భాగమే అన్నారు. మహనీయులను ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని తెలియజేశారు.
జిల్లా మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు.

కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

ఈనెల 29న కేటీఆర్ గారి పర్యటన నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐటీ టవర్, టౌన్ ఆల్, పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ మరియు ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు