తెలంగాణ సంక్షేమ పథకాలకు దేశమే బ్రహ్మ రధం పడుతున్నది.
జనగామ,(జనం సాక్షి) ఆగస్టు,26.తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు దేశం యావత్తూ బ్రహ్మ రధం పడుతున్నదని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్. ఎమ్. ఆర్. గార్డెన్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ను కే.సి.ఆర్ . చిత్రపటానికి పుష్ప అభిషేకం చేపట్టి ప్రారంభించారు.పెన్షన్లకు ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు శాసనసభ్యులు మున్సిపల్ చైర్మన్ పోకల జమున, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కౌన్సిలర్స్ తో కలిసి పెన్షన్ల కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు చేపట్టిన ఆసరా పెన్షన్ ల కార్యక్రమం వృద్దులకు ఎంతో మేలు చేకూరుస్తున్నదన్నారు.తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల పాలిట నిలుస్తూ కళ్యాణాలక్ష్మి, షాధిముబారక్ పథకాలతో ఆర్ధిక భారం తగ్గించిందని, రైతు బంధు పథకంతో రైతులు అప్పుల పాలు కాకుండా ఆదుకుంటున్నదన్నారు.
గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం అందించడమే కాకుండా ప్రసవించిన మహిళకు కేసీఆర్ కిట్ అందించి మగ బిడ్డకు 12వేలు, ఆడబిడ్డకు 13 వేలు అందిస్తూ సమజాహితం కోరే మహానుభావుడు కే.సి.ఆర్. అని ఎమ్మెల్యే తెలిపారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి కరోనా తో రాష్ట్రం ఎన్ని వడిదోడుకులకు లోనైన వెనుకాడక రైతు పాలిట నిలిచిన ఆత్మబంధువుడని కొనియాడారు. దళిత బంధుతో దళిత కుటుంబాలను ఆర్ధికంగా అభివృద్ధి పరచడం జరిగిందన్నారు.భిన్నత్వంలో ఏకత్వంగా స్వతంత్ర భారత వజ్రోత్సహాల ద్విసప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నా మన్నారు.ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాల అమలులో వివిధ రాష్ట్రాలు కితాబు ఇస్తున్నాయన్నారు. దేశ సర్వతోముఖాభి వృద్ధికి సంకేమ పథకాలు అవసరమని నేడు జనగామలో అర్హులైన 1126 మందికి ఆసరా పెన్షన్ కార్డులను పంపిని చేస్తు న్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధు మోహన్ మున్సిపల్ కమిషనర్ రవీందర్, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.




