తెలంగాణ సకల జనుల సమ్మెలో అంగన్వాడీలదే ప్రధాన పాత్ర-నక్క విజయ్ కుమార్

తెలంగాణ సకల జనుల సమ్మెలో అంగన్వాడీలదే ప్రధాన పాత్ర-నక్క విజయ్ కుమార్

ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందర అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి నక్క విజయకుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ సాధనలో సకల జనుల సమ్మెను ప్రారంభించి, తెలంగాణ వచ్చేంతవరకు అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాలు చేస్తే వచ్చిన తెలంగాణలో వారి న్యాయబద్ధమైన డిమాండ్స్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏ తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సైతం పట్టించుకోకుండా పోరాడారో ఆ తెలంగాణ ప్రభుత్వమే వారిని చిన్నచూపు చూడడం మరియు బెదిరించడం మీరు సమ్మెను విరమించుకోనీ ఉద్యోగంలో చేరకపోతే మీ ఉద్యోగాలను తీసేస్తామని బెదిరించడం ఇదేనా మనము కోరుకున్న సామాజిక తెలంగాణ అని వాపోయారు. ఖద్దరు చొక్కా నలగని ఎమ్మెల్యేలకు లక్షల రూ. జీతం కర్షకులకు కార్మికులకు తెలంగాణలో స్థానమే లేదా అని అన్నారు, ఆ రోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన ఆదేశ సూత్రాలను ఆధారంగా వెలువడ అంగన్వాడీలను నియమించగా ప్రభుత్వం అన్ని రంగాల్లో వారి సేవను ఉపయోగించుకుంటూ వారిని చిన్నచూపు చూడడం రాత్రి 10 గంటల వరకు వారు ఆన్లైన్ అప్ల్లో పనిచేసే విధంగా చేశారు. ప్రభుత్వం తలపెడుతున్న ప్రతి పథకంలో అంగన్వాడీల పాత్ర లేదా అని ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్ కనీస వేతనం 26,000. 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రమాద బీమా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల అధ్యక్షుడు జట్టి శ్రీనివాస్, గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి, సోషల్ మీడియా ఇన్చార్జి బచ్చల అంజి, జగదేవ్ పేట్ గ్రామ అధ్యక్షుడు శైలేందర్, ఉమేష్ ఆకుల గోపి, జంగా రాజేష్ ,అజయ్ రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.