తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే..

పల్లా నర్సింహ రెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
నల్గొండ బ్యూరో. జనం సాక్షి

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ…. నాడు నిజాం నవాబు జమీందారులు జాగిర్దారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి పేదల భూములు పంచి భారత యూనియన్ లో విలీనం చేయించిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ దే అని వారన్నారు. నేడు కొందరు చరిత్ర హీనులు చరిత్రను వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారాలను చేస్తూ పబ్బం గడుపుతూ ఓట్ల రాజకీయాలు చేస్తూన్న నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వారు చేసింది ఏదో చెప్పుకోవాలి కానీ ఇతరుల చరిత్ర చెప్పరాదు అని భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం సాగిన మహత్తరమైన తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర ను బిజెపి వక్రీకరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులను ఒకపక్క బీజేపీ ప్రభుత్వం అవమాన పరుస్తూ మరొక పక్క సాయుధ పోరాటం స్మరించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు దున్నే వానిదే భూమి అని వెట్టిచాకిరి రద్దు కావాలని భాంచన్ దొర అన్న ప్రజలని బందుకు పట్టించి నైజాముని గడగడలాడించినది కమ్యూనిస్టులే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఉజ్జిని యాదగిరి రావు మాట్లాడుతూ సాయుధ పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సాయుధ పోరాటం వారసులు కమ్యూనిస్టులే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన పల్లె నర్సింహా,జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు తూo బుచ్చిరెడ్డి,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి మైనోద్దీన్, మండల కార్యదర్శులు పార్లపల్లి కేశవరెడ్డి,ఎస్ కానక చారి,పోలె వెంకటయ్య,కుంభం జయరాములు, ఉప్పునూతల వెంకటయ్య,గుమ్మకొండ వేంకటేశ్వర రెడ్డి, బొమ్మ అచ్చయ్య,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,యాసాని పాండురంగారెడ్డి,ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షకార్యదర్శులు నూనె రామస్వామి,నూనె వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షకార్యదర్శులు బూడిగపాక జగన్, చల్లం పాండురంగారావు, ఎనిమల్ల నవీన్, బొడ్డుపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు