తెల్లపొగవచ్చేసింది

పోప్‌ ఎన్నికైనట్టు సంకేతం
వాటికన్‌ సిటీ :కొత్తపోప్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. అర్జెంటినాకు చెందిన జార్జ్‌ మారియో ఎన్నికయ్యారు. బుధవారం ఆయన ఎన్నికైనట్లు సిస్టీన్‌ చాపెల్‌ చిమ్నీ నుంచి తెల్లని పొగ వెలువడింది. 115 మంది కార్డినర్లు 266వ పోప్‌ను ఎన్నుకున్నారు.
ఎన్నికల్లో భారత్‌కు చెందిన ఐదుగురు కార్డినళ్లు పాల్గొన్నారు. గత నెల 28న బెనెడిక్ట్‌ 16 రాజీనామా చేసిన విషయం విదితమే. కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు మంగళవారం 115 మంది కార్డినల్స్‌ ప్రపంచ రోమన్‌ కేథలిక్‌ల ఆరాధ్య దైవమైన వాటికన్‌ సిటీలో సమావేశమయ్యారు. తొలిరోజు సమావేశంలో పోప్‌ ఎన్నికపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సిస్టిన్‌ చాపెల్‌లోని కాసాశాంట్‌ మార్టాపైన ఉండే చిమ్నీ నుంచి నల్లని పొగ వెలువడింది. బుధవారం జార్జ్‌ మారియో ఎన్నికవడంతో చిమ్నీ నుంచి తెల్లపొగ వెలువడింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి భారీగా కేథలిక్‌లు వాటికన్‌ సిటీకి తరలివచ్చారు. కొత్త పోప్‌ ఎన్నికపై ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి.