తేజస్వి ధర్నాకు హాజరు కానున్న రాహుల్‌

పాట్నా,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ముజఫర్‌పూర్‌ జిల్లాలోని షెల్టర్‌ ¬ంలో 34 మంది బాలికలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బీహార్‌ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శనివారంనాడు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద జరుపనున్న ధర్నాకు వివిధ పార్టీల నుంచి సంఘీభావం పెరుగుతోంది. ముజఫరాపూర్‌లో సంస్థాగత సామూహిక అత్యాచారాలకు నితీష్‌ ప్రభుత్వం బాధ్యత ఉందని, నిందితులకు సర్కార్‌ కొమ్ముకాస్తోందని ఆరోపిస్తున్న తేజస్వి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, తాను చేపట్టనున్న ధర్నాలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమ్మతి తెలియజేశారని తేజస్వి శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ సైతం నితీష్‌కు వ్యతిరేకంగా తేజస్వి చేపట్టే ధర్నాలో పాల్గొనేందుకు సముఖత తెలిపారు. అనూహ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సైతం తేజస్వి ధర్నాకు సంఘీభావం ప్రకటించింది.