తొందరగా తేల్చండి
ఆదిలాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తే కాలగర్భంలో కలవడం ఖాయమని ఐకాస నేతుల హెచ్చరించారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేదీక్షలు ఆదివారంనాటికి 1064వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికే కేంద్రం జాప్యం చేసినందున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఉద్యమం మరింత తీవ్రతరం కాకముందే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజల సహనాన్ని పరిష్కరించ కుండా స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు.