తొలి మహిళా ఐఎఎస్‌ కన్నుమూత

ముంబయి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): భారత్‌ తొలి మహిళా ఐఎఎస్‌ అధికారి అన్నా రాజమ్‌ మల్హోత్రా (91) మంగళవారం ఉదయం కన్నుమూశారు. 1951లో ఆమె సివిల్‌ సర్వీస్‌లో చేరారు. మద్రాస్‌ క్యాడర్‌ అధికారిగా ఆమె పని చేశారు. నాటి సిఎం సి.రాజగోపాలచారి ప్రభుత్వంలో అన్నా రాజమ్‌ కీలక పదవుల్లో పని చేశారు. ముంబయిలోని తన నివాసంలో మంగళవారం కన్నుమూశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1927, జులైలో ఆమె జన్మించారు. 1985 నుంచి 1990 వరకు ఆర్‌బిఐ గవర్నర్‌గా పని చేసిన ఆర్‌ఎస్‌ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు. మొదటిసారి ఆమె ¬సూరు సబ్‌ కలెక్టర్‌గా పని చేశారు. ఏడుగురు సిఎంల వద్ద ఆమె అధికారిగా పని చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వద్ద కూడా ఆమె పని చేశారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ ప్రాజెక్టుకు ఆమె ఇంచార్జ్‌గా పని చేశారు. అన్నా రాజమ్‌ మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.