త్యాగదనుల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మిద్దాం- ఏఐఎఫ్ డిడబ్ల్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి

జనం సాక్షి : నర్సంపేట
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైనదని పురుషులతో సమానంగా ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటంలో భాగస్వాములు అయ్యారని ఆ త్యాగదనుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధ పిలుపునిచ్చారు. ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా డివిజన్ స్థాయి సదస్సును సంఘం డివిజన్ అధ్యక్షురాలు జన్ను జమున అధ్యక్షతన నర్సంపేటలో నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వంగల రాగసుధ మాట్లాడుతూ మోడీ కేసీఆర్ పాలనలో మహిళలపై హింస వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయని మహిళా రక్షణ చట్టాలు ఉన్న అమలుకు నోచుకోవడం లేదని ఆనాడు బ్రిటిష్ నైజాం లకు వ్యతిరేకంగా తిరగబడి పోరాడిన మహోద్యమ నాయకులు ఆరుట్ల కమలాదేవి మద్ది కాయల లక్ష్మక్క మల్లు స్వరాజ్యం చాకలి ఐలమ్మ లాంటివారు మహిళల కేక యావత్ తెలంగాణ సమాజానికి ఉద్యమ ప్రేరణకు ఆదర్శంగా నిలిచారని వారి స్ఫూర్తితో మహిళా హక్కుల కోసం అనిచివేతకు వ్యతిరేకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి మహిళలు నడుము బిగించాలని పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా డివిజన్ నాయకులు నకినబోయిన భవాని గణిపాక బిందు అప్సర సరూప రాజమ్మ రజిత పద్మ లక్ష్మి కేతమ్మ నారాయణ విశ్వరూప తదితరులు పాల్గొన్నారు.
Attachments area