త్వరలో వైఎస్‌ఆర్‌సిపిలోకి.. ఇంద్ర
అదిలాబాద్, నవంబర్ 23 : రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ రాజకీయ భవిష్యత్తు కోసం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తెలంగాణ ఉద్యమం కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి భారీగా వలసలు జరుగుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోనప్పలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. శుక్రవారంనాడు వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం తమ అనుచర వర్గంతో ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని నిర్మల్ పట్టణంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు వారి అనుచరగణం ఏర్పాట్లు చేస్తోంది.