దమ్మాయిగూడెం లో నవంబర్ 05 న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి న్యూడెమోక్రసీ అమరవీరుల సంస్మరణ సభ పోస్టర్ ఆవిష్కరిస్తున్న న్యూ డెమోక్రసీ నాయకులు
ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం. (నవంబర్ 02) విప్లవోద్యమంలో అనేకమంది అమరవీరులు తమ విలువైన ప్రాణాలను భూమి కోసం భుక్తి కోసం దేశ ప్రజల కోసం అంకితం చేశారని నిత్యం మాటల్లోనూ చేతల్లోనూ సజీవులుగా ఉంటారని. వారి త్యాగాల పూలై పుష్పించి స్వేచ్ఛ పరిణామాలు వెదజల్లుతారని. తొలకరి నేలంతా చిగురించినట్లు వీరులు తమ రక్తంతో సామ్యవాద పంటలను పండిస్తారని కోరుతూ దమ్మాయిగూడెం లో నాడు ఉన్నం నాగేశ్వరరావు పెత్తందారీ స్వభావానికి వ్యతిరేకంగా నిర్మించినటువంటి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేస్తూ ఉన్నo పిచ్చమ్మ పోరాటంలో కీలకపాత్ర పోషించారని అదేవిధంగా మద్దినేని సీతయ్య, ఏలూరు సీతారామయ్య, ఆళ్ల అంబరీష్ లాంటి ఎంతో మంది అమరవీరులు పెత్తందారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి పెత్తందారి స్వభావాన్ని అంతమొందించే వరకు పోరాటాలు నిర్వహించారని వారి ఆశయ సాధనలో వారిని స్మరించుకుంటూ
ఈ నెల 05న శనివారం నాడు తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం లో సంస్మరణ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ
ఈబహిరంగ సభను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు దమ్మాయిగూడెం గ్రామంలో మరియు మండలంలో జింకలగూడెం, హస్నాబాద్ గ్రామాలలో పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ గ్రామ కార్యదర్శి గాదె రామదాసు మండల నాయకులు ఎస్ కె సుభాన్,ఎస్కే షబ్బీర్, కొమరయ్య, గోకినపల్లి రమేష్ , మాగి రామ్మూర్తి, మాగి లక్ష్మణ్, రాకేష్, సర్దార్ షేక్, ఇమామ్, మీరా, హుస్సేన్, సైదా, లాలు,అరుణ, రాములమ్మ ,నాగమణి ,
యకుబ్ తదితరులు పాల్గొన్నారు