దర్జాగా హరివిల్లు రిసార్ట్ ను నడపండి

 వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 23
అనంతగిరిలోని హరివిల్లు రిసార్ట్ ప్రవేశ ద్వారానికి అటవీ శాఖ అధికారులు అడ్డంగా కందకం తవ్వడంతో హరివిల్లు రిసార్ట్ మూతపడిన .  విషయమై హరివిల్లు రిసార్ట్ యజమాని గంగాధర్ రావు హైకోర్టును ఆశ్రయించగా.. ప్రవేశ ద్వారం దారి  యధావిధిగా కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు( స్టేటస్కో) జారీ చేశారని   హరివిల్లు రిసార్ట్ ప్రొప్రైటర్ గంగాధర్ రావు అన్నారు. ఆదివారం అనంతగిరి లోని హరివిల్లు రిసార్ట్ లో  విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హరివిల్లులో తప్పుడు పనులకు తావు లేదని, సంబంధిత అధికారులు ఎప్పుడైనా వచ్చి తనిఖీలు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రిసార్ట్ లో తప్పుడు పని జరిగినట్లు నిర్ధారణ అయితే మరుసటి రోజు నుంచి హరివిల్లు రిసార్ట్ ను తామే మూసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అటవీ భూమి హరివిల్లు రిసార్ట్ లో ఉన్నట్లు భావిస్తే జాయింట్ సర్వే నిర్వహించి, అటవీ భూమి ఉన్నట్లు నిర్ధారణ అయితే నిరభ్యంతరంగా తీసుకోవచ్చని అటవీ శాఖ అధికారులకు సూచించారు. చట్టం తన పని తాను చేసుకు పోతుందని, మాకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఆయన తెలిపారు. మా వైపు న్యాయం ఉన్నందునే హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. హరివిల్లు రిసార్ట్ లో ఎలాంటి తప్పుడు పనులకు తావివ్వకుండా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ రిసార్ట్ ను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో హరివిల్లు రిసార్ట్ ద్వారా వెయ్యి నుంచి 2 వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో హరివిల్లు రిసార్ట్ లో పనిచేసే కార్మికులను, సిబ్బందిని కొన్ని కారణాల వల్ల తొలగించామని, వారిని అందరిని తిరిగి యధావిధిగా విధుల్లోకి చేర్చుకోవడం జరిగిందని తెలిపారు.