*దళితరత్న వెల్ఫేర్ యూత్ ఆద్వర్యంలో కొమురంభీం జయంతి వేడుకలు*

రామన్నపేట అక్టోబర్ 23 (జనంసాక్షి)
ఆదివాసిల హక్కుల కోసం పోరాడిన కొమురంభీం జయంతి సందర్బంగా మునిపంపుల మదిర తుమ్మబావిగూడంలో దళితరత్న వెల్ఫెర్ యూత్ ఆద్వర్యంలో యువకులు చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. సంఘం నాయకులు అప్పం సురేందర్ మాట్లాడుతూ జల్-జంగల్-జమీన్ నినాదంతో వీరోచిత పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయిన వీరుడి చరిత్రను నేటి తరం తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట విజయ. ఆశీర్వాదం, ఉపేందర్,ప్రవీణ్, గణేష్, అభిరుప్,ఆనందం, సావిత్రి, విజయ, భాగ్యమ్మ,శాలిని,లలిత ,పల్లవి  ఝాన్సీ,అంజలి తదితరులు పాల్గొన్నారు.