దళితులకు నీళ్లు తాగే హక్కు లేదా…..?

టేకుమట్ల.ఆగస్టు22(జనంసాక్షి) 75 సంవత్సరాల భారత దేశంలో దళితులకు నీళ్లు తాగి హక్కులేదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి,కన్వీనర్ గట్ల రాజన్న అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాజస్థాన్ రాష్ట్రంలో ఇంద్ర కుమార్ మేఘవల్ ను ఉపాధ్యాయుడు విరోచితంగా కొట్టి చంపటాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో ఎం ఎస్ పి మండల కన్వీనర్ రేణుకుంట్ల సంపత్,ఎం ఎస్ పి మండల కో కన్వీనర్ రామ్ రాంచందర్ ఆధ్వర్యంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ అంబాల చంద్రమౌళి మాదిగ హాజరై మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాల వజ్రోత్సవం జరుపుతున్న సందర్భంలో మంచి నీళ్లు తాగాడు అని ఒక నిందతో ఒక దళిత బిడ్డను ఇంద్ర కుమార్ మెగ్వల్ ను ఉపాధ్యాయుడు కొట్టి చంపటం చాలా దుర్మార్గమని దళితులకు స్వతంత్రం రాలేదని.నీళ్లు తాగినందుకు కొట్టు చంపటం చాలా దురదృష్టకరమని తక్షణమే ఉపాధ్యాయుడను ఉరితీయాలని దళితులను అన్నారు.ఈ కార్యక్రమంలో రేణుకుంట్ల కొమురయ్య,దోర్నాల సారయ్య,కన్నూరి సారయ్య, అక్కల రాజయ్య,అక్కల భద్రయ్య,ఇల్లందుల శంకర్,
తదితరులు ఉన్నారు.